201 మంది భక్తులు అయ్యప్ప దీక్ష
NEWS Nov 25,2024 07:53 am
కోరుట్ల అయ్యప్పస్వామి ఆలయంలో సోమవారం స్వామివారి మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర నక్షత్రం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ చరిత్రలోనే మొదటిసారిగా 201 మంది భక్తులు అయ్యప్ప దీక్ష స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పాలెపు రాముశర్మ, ఆలయ శాశ్వత గౌరవాధ్యక్షుడు చిదురాల నారాయణ గురుస్వామి మాలధారణ గావించారు. కార్యక్రమంలో అంబటి శ్రీనివాస్ గురుస్వామి, ఆలయ కార్యవర్గ సభ్యులున్నారు.