పంచారామ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
NEWS Nov 25,2024 05:03 am
కార్తీకమాసం చివరి సోమవారం పంచారామ క్షేత్రం సామర్లకోట శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే స్వామి వారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆలయ కోనేరులో కార్తీక స్నానాలు ఆచరించిన భక్తులు జమ్మి చెట్టు వద్ద, ధ్వజస్తంభం వద్ద భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి, పూజలు నిర్వహించారు. రావిచెట్టు వద్ద ఉన్న శివలింగానికి భక్తులు అభిషేకాలు నిర్వహించారు.