కిడ్నాప్ అయిన పసికందు లభ్యం
NEWS Nov 24,2024 04:06 am
నిలోఫర్ ఆసుపత్రిలో నాంపల్లి పోలీసులు 6 గంటల్లోనే చిన్నారి ఆచూకీ కనుగొన్నారు. జహీరాబాద్‌కు చెందిన హసీనా బేగం, గఫార్ దంపతులకు చెందిన నెల రోజుల బాబుకు జాండీస్ రావడంతో హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. నిన్న రాత్రి హసీనా బేగం బాబును ఎత్తుకొని ఉండగా.. ఆసుపత్రి సిబ్బందిని అని తల్లిని నమ్మించిన ఓ మహిళ బాబుని ఎత్తుకొని అక్కడి నుంచి జారుకుంది. పరిగి వద్ద కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని సురక్షితంగా తల్లివద్దకు చేర్చారు. ఈ కేసులో కిడ్నాప్ చేసిన వ్యక్తితో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని కూడా నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.