తెలంగాణతల్లి విగ్రహావిష్కరణకు ప్రియాంక?
NEWS Nov 24,2024 03:42 am
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వచ్చే నెల 9న జరిగే ముగింపు వేడుకలకు ఏఐసీసీ అధినేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీనీ ఆహ్వానించాలని, అదే రోజు సెక్రెటేరియట్‌లో తెలంగాణతల్లి విగ్రహావిష్కరణకు ఆమె స్పెషల్ గెస్ట్‌గా ఉంటే బాగుంటుందని సీఎం రేవంత్ ప్లాన్ చేసినట్టు టాక్. సోనియా అరోగ్య సమస్యల వల్ల రాష్ట్రానికి వస్తారో.. లేదోననే డిస్కషన్ పార్టీలో నడుస్తున్నది. విజయోత్సవాలకు రావాలని సోనియా, రాహుల్, ప్రియాంకను ఆహ్వానించేందుకు 2-3 రోజుల్లో రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు.