ప్రెస్ క్లబ్ పరువుకు భంగం కలిగించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
NEWS Nov 23,2024 04:31 pm
వాట్సాప్ మాధ్యమాలలో నిన్న రాత్రి ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా పోస్టులు పెట్టిన పల్లె నరేష్ అనే వ్యక్తిపై ప్రెస్ క్లబ్ సభ్యులు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న సంఘటనలను ఉదహరిస్తూ పోస్టు చేయడం జరిగింది. ఈ వార్తను పల్లె నరేష్ అనే వ్యక్తి స్క్రీన్‌షాట్ తీసి ప్రెస్ క్లబ్ లోగో కనిపించే విధంగా ఇతర వాట్సాప్ గ్రూపుల్లో గౌరవ మర్యాదలు, సభ్యులకు ఇబ్బంది కలిగే విధంగా కామెంట్లు పెట్టి పోస్టు చేశాడని రిపోర్టర్‌లు తెలిపారు.