ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు
NEWS Nov 23,2024 12:18 pm
ఇబ్రహీంపట్నం మండలంలోని గ్రామాల్లో దాన్యం కొనుగోళ్లలో జాప్యం చోటు చేసుకోవద్దని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు తహశీల్దార్ ప్రసాద్ సూచించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, రికార్డులను పరిశీలించారు. తేమ వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని అన్నారు.