కోతుల బెడద నుండి కాపాడండి
NEWS Nov 23,2024 04:37 am
మెట్ పల్లి పట్టణంలో కోతుల బెడద భరించలేనంతగా ఉందని, కోతుల బెడద నుండి పట్టణ ప్రజలను మున్సిపల్ అధికారులు కాపాడాలని బీజేపీ 19వ వార్డు ఇన్చార్జి బోడ్ల ఆనంద్ తెలిపారు. ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారని, ప్రతినిత్యం కోతులు ఎవరినో ఒకరిని గాయపరుస్తున్నాయని, వందల సంఖ్యలో కోతులు రోడ్లపై, ఇంటి గోడలపై సంచారం చేస్తూ మహిళలు, వృద్ధులు, పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పారు.