మెట్ పల్లి పట్టణంలోని ఓ హాస్పిటల్ లో ఆపరేషన్ కోసం ఓ మహిళకు రక్తం అవసరం కాగా, రోగి బంధువులు స్నేహాలయ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట కిరణ్ కుమార్ సంప్రదించారు. దీంతో స్నేహాలయ సభ్యుడు అయిన అనంతుల రమేష్ తో రక్తదానం చేయించారు. అత్యవసర సమయంలో రక్తదానం చేసిన రమేష్ ను పలువురు అభినందించారు.