కేకే చౌదరిని కలిసిన రాజంపేట టీడీపీ నేతలు
NEWS Nov 23,2024 06:47 am
అన్నమయ్య జిల్లా: ఆంధ్రప్రదేశ్ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన తొలిసారిగా రైల్వే కోడూరుకు వచ్చిన కేకే చౌదరితో రాజంపేట నేతలు భేటీ అయ్యారు. రైల్వే కోడూరులో ఆయనను కలిసి అభినందించారు. పార్టీకి మంచి పేరు తీసుకొచ్చేలా రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని వారు ఆయనను కోరారు.