కోటి కుటుంబాలకు సర్వే పూర్తి
NEWS Nov 22,2024 05:16 pm
తెలంగాణ వ్యాప్తంగా కోటి కుటుంబాలకు సమగ్ర ఇంటింటి సర్వే పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది. ములుగు, జనగామ జిల్లాల్లో 100 శాతం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో 99.9 శాతం సర్వే పూర్తయినట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.16 కోట్ల నివాసాలు గుర్తించామని, నేటి వరకు 1.01 కోట్ల నివాసాల్లో సర్వే కంప్లీట్ చేసి 87.1 శాతం సాధించామని వివరించింది.