మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా శిరీష
NEWS Nov 22,2024 02:23 pm
కథలాపూర్ మండలం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా పులి శిరీషను నియమిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అది శ్రీను ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పులి శిరీష హరి ప్రసాద్ మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. మార్కెట్ కమిటీ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని, మార్కెట్ కమిటీ అభివృద్ధి కొరకు, మండల అభివృద్ధి కొరకు తోడ్పడుతానని చెప్పారు. 12 మంది సభ్యులతో మార్కెట్ కమిటీ నూతన కమిటీ ఏర్పాటైంది.