గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్
NEWS Nov 22,2024 01:47 pm
నిర్మల్ జిల్లా: పట్టణంలోని జిల్లా గ్రంథాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం అన్ని రకాల పుస్తకాలను సరిపడినవన్ని అందుబాటులో ఉంచాలన్నారు. గ్రంథాలయంలో కుర్చీల కొరత రాకుండా చూడాలన్నారు.