విద్యార్థులు ఆటల్లో రాణించాలి
NEWS Nov 22,2024 01:43 pm
విద్యార్థులు ఆటల్లో రాణించాలని మెట్‌పల్లి పట్టణంలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్ ప్రిన్సిపాల్ విజయ్ కుమారి అన్నారు. జగిత్యాల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన ఆటల పోటీల్లో పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న యశ్వంత్ జంపింగ్, 300 మీటర్ల పరువు పందెంలో మొదటి స్థానంలో నిలిచాడు. విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపాల్ విజయకుమారి, పిటి కిషన్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అభినందించారు.