ధాన్యం కొనుగోలును పరిశీలించిన కలెక్టర్
NEWS Nov 22,2024 01:44 pm
నిర్మల్ జిల్లా: వెంగ్వాపేట్ గ్రామంలో పిఏసిఎస్ మంజులాపూర్ సొసైటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. రైతులకు కేంద్రాల్లో అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయి చేరేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.