ధాన్యం కొనుగోలు పరిశీలించిన కలెక్టర్
NEWS Nov 22,2024 12:14 pm
నిర్మల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో పిఏసిఎస్ మంజులాపూర్ సొసైటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం పరిశీలించారు. రైతులకు కేంద్రాల్లో అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని సూచించారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి, లారీలలో లోడ్ చేసి నిర్దేశించారు.