రాజకీయలకు పోసాని గుడ్‌బై
NEWS Nov 21,2024 04:12 pm
నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఇక తాను బతికి ఉన్నన్ని రోజులు జన్మలో రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పారు.ఇక చంద్రబాబు, పవన్, లోకేష్‌లను కృష్ణ మురళి.. అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై ఇప్పటికే ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. పలు స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోసాని నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది.