అభివృద్ధి,సంక్షేమానికి పాటుపడుతూ సమర్థవంతంగా పథకాలను అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సంబురాలు నిర్మల్ లోని దివ్య గార్డెన్స్ లో సాయంత్రం ఘనంగా జరిగాయి. కళాయాత్ర ప్రదర్శనలో అంతడుపుల నాగరాజు బృందం ఆటపాటలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటుతూ, ప్రభుత్వ సంక్షేమ పాలనను ఆవిష్కృరింపజేశారు.