జిల్లాలో ధాన్యం కొనుగోలు వివరాలు
NEWS Nov 21,2024 09:09 am
జగిత్యాల జిల్లాలో 430 ఫ్యాక్స్ ఐకెపి డీసీఎంఎస్ మెప్మా కేంద్రాల ద్వారా 1.02 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత తెలిపారు. 13,934మంది రైతుల నుంచి రూ.239కోట్ల విలువైన ధాన్య సేకరణ జరిగిందని, 165 మెట్రిక్ టన్నుల సన్నగింజ రకాలను సేకరించినట్లు తెలిపారు. రైతులకు జిల్లా వ్యాప్తంగా రూ.96 కోట్ల చెల్లింపు జరిగిందని, మిగిలిన ధాన్య సేకరణ వేగమంతమవుతుందన్నారు.