డిసెంబర్ 4న విద్యార్థులకు నైపుణ్య పరీక్ష
NEWS Nov 20,2024 10:26 am
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం డిసెంబర్ 4న పరీక్ష నిర్వహిస్తున్నట్లు మల్యాల మండల విద్యాధికారి జయసింహారావు తెలిపారు. ఈ మేరకు 3,6,9వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టుల వారిగా ప్రత్యేక బోధన చేస్తున్నట్టు చెప్పారు. సబ్జెక్టులకు సంబంధించిన మాదిరి ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రతి పాఠశాలలో ప్రత్యేక బోధన చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా ఫలితాల ఆధారంగా పాఠశాలలకు ర్యాంకులు ప్రకటిస్తారని అన్నారు.