CM రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన సందర్భంగా రాత్రికి రాత్రి BJP నాయకులను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారని నాయకులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలన్నారు. వారితోపాటు మల్యాల మారుతి, పిడుగు ఆనంద్ రెడ్డి, గడ్డం జీవన్ రెడ్డి ఉన్నారు.