జ్యోతి దేవికి శశిథరూర్ సంతాపం
NEWS Nov 20,2024 09:06 am
మెట్‌పల్లి మాజీ MLA కొమిరెడ్డి జ్యోతి దేవికి కేంద్ర మాజీ మంత్రి, MP శశిథరూర్ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. ఆమె ఒక గొప్ప మహిళ అని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడిన యోధురాలన్నారు. బలీయమైన శాసనసభ్యురాలు, అఖిల భారత మహిళా శాసనసభ్యుల ఫోరమ్ అధినేత్రి, అంకితభావం కలిగిన కాంగ్రెస్ వ్యక్తి అని, అన్నింటికంటే ముఖ్యంగా ముగ్గురు అంకితభావంతో కూడిన కుమారులకు స్ఫూర్తిదాయకమైన తల్లి అని కొనియాడారు.