బోధన్ కు చెందిన సాయికుమార్ అనే హనుమాన్ భక్తుడు బోధన్ నుండి దాదాపు 150 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మంగళవారం కొండగట్టుకు చేరుకున్నాడు. లోక కళ్యాణం కోసం పాదయాత్ర చేపట్టానని, హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కొండగట్టుకు పాదయాత్ర చేశానని తెలిపారు. అనంతరం స్వామివారికి తలనీలాలు సమర్పించి, దర్శించుకున్నారు.