కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్‌లో ఇందిరా గాంధీ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ.. దేశాన్ని నడిపించిన చరిష్మా గల రాజకీయ నాయకులలో ఇందిరా గాంధీ అగ్రగణ్యులని కొనియాడారు. పేదరిక నిర్ములన కోసం ఇందిరా చేసిన సేవలు ఎంతో గొప్పవన్నారు.