జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో చేపట్టిన సమగ్ర ఇంటి ఇంటి కుటుంబ సర్వేను ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సర్వేకు వచ్చిన అధికారులకు ప్రజలు వారి వివరాలు క్లుప్తంగా చెప్పాలని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు. నిధుల కొరతతో కొన్ని పథకాలు అమలు కావడం లేదని, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్‌తో పాటు అన్ని పథకాలు అమలు చేస్తుందన్నారు.