కాకినాడలో క్లాప్ వాహన డ్రైవర్లు ఆందోళన చేపట్టి 25 రోజులకు చేరింది. ఈ ఆందోళనలో భాగంగా సోమవారం ఆందోళన కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేష బాబ్జి, క్లాప్ డ్రైవర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు పలివెల వీరబాబు, సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలక వెంకటరమణ మాట్లాడుతూ 25 రోజులుగా జీతాలు కోసం ధర్నా చేస్తున్నా వేయకపోవడం అన్యాయమన్నారు. తక్షణమే జీతాలు అందజేయాలని కోరారు.