మహారాష్ట్ర సీఎం పదవి రేసులో తాను లేనని ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే కీలక ప్రకటన చేశారు. మహాయుతి కూటమిలో సీఎం పదవికి ఎలాంటి రేస్ లేదని స్పష్టం చేశారు. ఎన్డీయేను అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. మహాయుతి కూటమి విజయం సాధిస్తే బీజేపీ నేతకే సీఎం పదవి దక్కే అవకాశం ఉన్నట్టు షిండే వ్యాఖ్యలతో స్పష్టమైంది. అజిత్ పవార్‌కు మరోసారి నిరాశ తప్పదని పలువురు విశ్లేషిస్తున్నారు.