ఈ నెల 20న వేములవాడలో జరగనున్న సభలో సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ బాధితుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా పంపిణీ చేయనున్నారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన 17 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు (ప్రొసీడింగ్స్) ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.85 లక్షలు కేటాయించింది. ట్రెజరీ ద్వారా సొమ్ము వారి బ్యాంకు ఖాతాలలోకి నేరుగా బదిలీ అవుతుంది.