పెర్కిట్ లో దొంగల బీభత్సం
NEWS Nov 18,2024 04:59 am
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గ్రామంలో గత అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన సయ్యద్ మొయినుద్దీన్ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స కోసం నిజామాబాద్ కి వెళ్లారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో శనివారం అర్ధరాత్రి దొంగలు ఇంటి తాళం పగలకొట్టి బీరువాలో ఉన్న 12 తులాల బంగారంతో పాటు 30 తులాల వెండి, రూ.50 వేల నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.