కార్తీక సోమవారం.. పోటెత్తిన భక్తులు
NEWS Nov 18,2024 04:59 am
ఆత్రేయపురం మండలంలో ప్రసిద్ధి చెందిన ర్యాలీ గ్రామంలోని శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు 3వ కార్తీక సోమవారం కారణంగా కార్తీక శోభ వైభవంగా ఉంది. తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. గోదావరిలో స్నానమాచరించి, ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి, పూజలు చేశారు. దర్శనం చేసుకున్న భక్తులకు తీర్ద ప్రసాదాలు అందజేశారు.