బల్లెపల్లి మోహన్‌కు అరుదైన గౌరవం
NEWS Nov 17,2024 06:06 pm
చెన్నైలో తిరువల్లువర్ - కబీర్ దాస్ - యోగి వేమన: సమన్వయపూర్వక అధ్యయనంపై అంతర్జాతీయ సెమినార్ జరిగింది. ముఖ్య అతిథిగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పాల్గొన్నారు. తెలుగు సంగీత దర్శకుడు, గాయకుడు బల్లెపల్లి మోహన్‌కు అరుదైన గౌరవం దక్కింది. వేమన పద్యాలను పాడుతూ, మ్యూజిక్ అందిస్తూ డిజిటలైజేషన్ చేస్తున్న కృషిని కొనియాడుతూ బల్లెపల్లి మోహన్‌కు అవార్డు అందించి సత్కరించారు.