పుట్టినరోజు అనగానే విందు వినోదాలతో ఎంజాయ్ చేస్తున్న ఈ రోజులలో తమ కుమారుని జన్మదినం సందర్భంగా దంపతులిద్దరూ రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామానికి చెందిన కర్నే రాజేందర్ రెడ్డి వందన రెడ్డి కుమారుడు వేద్ విఖ్యాత్ రెడ్డి మూడో పుట్టినరోజు సందర్భంగా జగిత్యాలలోని బ్లడ్ బ్యాంకుకు వెళ్లి దంపతులు ఇద్దరూ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు.