బీసీలకు అన్ని రంగాలలో అన్యాయం
NEWS Nov 17,2024 02:20 pm
బీసీలకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుందని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సాయిని నరేందర్ అన్నారు. మెట్‌పల్లి పట్టణంలో ఆదివారం జరిగిన బామ్ సేఫ్ శిక్షణ తరగతులలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే బీసీ జనగణన చేయకుండా రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో దయ్య రాజారాం, తూల రాజేందర్, దయ్య రఘువీర్, నీరటి నరేందర్, శివ తదితరులు పాల్గొన్నారు.