ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం శంకర్ పల్లి శివారులోని కేకే-5 గని సమీపంలో పెద్దపులి సంచరించింది. కేకే-5 గని పంప్ దగ్గర మహారాష్ట్ర నుంచి పత్తి ఏరడానికి వచ్చిన వలస కూలీలు ఏర్పాటు చేసుకున్న గుడారాల దగ్గర పెద్దపులి కనిపించింది. దారి వెంట వెళ్తున్న పులిని చూసి వలస కూలీలు ఒక్కసారిగా కేకలు వేశారు. శంకర్ పల్లి నుంచి చతలాపూర్ అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు కూలీలు చెప్తున్నారు.