జేక్ పాల్‌తో నిన్న జరిగిన బాక్సింగ్ మ్యాచ్‌లో తాను ఓడినప్పటికీ గెలిచినట్లేనని దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ ట్వీట్ చేశారు. ‘ఆడినందుకు, ఓడినందుకు నాకు ఏమాత్రం బాధ లేదు. జూన్‌లో చావు అంచుల వరకూ వెళ్లాను. 8సార్లు రక్తం మార్చారు. సగం రక్తాన్ని కోల్పోయాను. మళ్లీ ఆరోగ్యవంతుడైనప్పుడే నేను గెలిచాను. నాకంటే సగం వయసున్న ఫైటర్‌తో 8 రౌండ్లు పోరాడి నిలబడటాన్ని నా బిడ్డలు చూశారు. నాకు అదే చాలు’ అన్నారు.