గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
NEWS Nov 15,2024 02:41 pm
మెట్‌పల్లి: గంజాయి అమ్ముతున్న ఇద్దరు యువకుల్ని పట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెట్‌పల్లి పట్టణంలోని అర్బన్ కాలనీలో ఇద్దరు యువకులు గంజాయి అమ్ముతున్నారే సమాచారం మేరకు ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా పట్టణానికి చెందిన పోతు అక్షయ్, బండి సాయిరాం అనే యువకుల వద్ద 200 గ్రాముల గంజాయి పట్టుకుని విచారించారు. వీరు నిజామాబాదు రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యకి వద్ద కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతున్నట్లు తెలిపారు.