బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న జువ్వాడి
NEWS Nov 15,2024 02:30 pm
కోరుట్ల మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్ కటుకం రాజేశ్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేకపూజలు నిర్వహించి మొక్కులను చెల్లించుకున్నారు. అన్నదానాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.