యువత చెడుకు దూరంగా ఉండాలి: ఎస్సై
NEWS Nov 14,2024 06:59 pm
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్సై అనిల్ అన్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నిర్వహించిన అవేర్నెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాలకు ఆకర్షితులై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. సోషల్ మీడియాకు, సెల్ ఫోన్ లకు బానిసలు కావద్దని, అవసరం మేరకే వాటిని వినియోగించుకోవాలని సూచించారు.