కోరుట్ల పట్టణానికి చెందిన రచన అనే మహిళ గత నెల 23న RTC బస్సులో ప్రయాణం చేస్తున్న సమయములో ఫోన్ పోగొట్టుకున్నారు. ఈ మేరకు వెంటనే కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ రికవరీ చేసి సదరు మహిళ బాబాయ్ అయిన రాజుకు ఎస్సై శంకర్ గురువారం అందజేశారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్లో సంప్రదిస్తే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించవచ్చని ఎస్ఐ తెలిపారు.