యూసఫ్ నగర్: బాలల దినోత్సవ వేడుకలు
NEWS Nov 14,2024 06:55 pm
కోరుట్ల మండలంలోని యూసుఫ్ నగర్ లోని జడ్పిహెచ్ఎస్ బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన స్వయంపాలన దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గుగ్గిళ్ళ సురేశ్ గౌడ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయవృత్తి చాలా పవిత్రమైనదని పేర్కొన్నారు. అదేవిధంగా సమాజంలో మార్పునకు ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జనార్ధన్, చాంద్ ఖాన్ భాస్కర్, రాజగోపాల్ ఉన్నారు.