కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన డీఎస్పీ
NEWS Nov 14,2024 07:00 pm
మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ సందర్శించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయన కొనుగోలు ప్రక్రియను, ధాన్యం రవాణా తీరును పరిశీలించారు. రవాణా సాఫీగా జరగాలని సూచించి, అక్కడున్న రైతులతో మాట్లాడారు. ఆయన వెంట స్థానిక తహశీల్దార్ మునీందర్, సీఐ నీలం రవి, ఎస్సై నరేష్ కుమార్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.