చిట్వేలు: విద్యార్థులు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ కార్యదర్శి గాడి ఇంతియాజ్ కోరారు. బాలల దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ వర్షాకాలం మొక్కలు నాటితే త్వరితగతిన ఏపుగా పెరుగుతాయని ఆయన అన్నారు. భవిష్యత్తు తరాల కోసం విద్యార్థులు ఎప్పటినుండి మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలన్నారు.