సరస్వతీదేవి ఆలయంలో అక్షరాభ్యాసం
NEWS Nov 14,2024 06:54 am
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపల్లి సరస్వతీదేవి ఆలయంలో బుధవారం చిన్నారులకు అక్షరాబ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులు వారి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, సరస్వతీదేవి సేవలో తరించారు. ఆలయ అర్చకులు సరస్వతీదేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు, అభిషేకాలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.