రాష్ట్రస్థాయి పోటీలకు మల్యాల విద్యార్థి
NEWS Nov 14,2024 06:56 am
మల్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి శివకుమార్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్టు ప్రధానోపాధ్యాయురాలు అనుపమ తెలిపారు. కొడిమ్యాలలో జరిగిన ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచి ఎంపికైనందుకు శివకుమార్ ను అభినందించారు. ఈనెల 16 నుండి 18 వరకు మెదక్ జిల్లా చేగుంటలో జరగనున్న రాష్ట్ర స్థాయి పాఠశాలల వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.