సిరిసిల్ల పట్టణానికి చెందిన నెల్లుట్ల వేణు అను అతను 3 నెలల క్రితం కోరుట్లలో ఫోన్ పోగొట్టుకున్నాడు. ఈ మేరకు వెంటనే కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ రికవరీ చేసి బుధవారం బాధితుడికి ఎస్సై శ్రీకాంత్ అందజేశారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్లో సంప్రదిస్తే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించవచ్చని ఎస్ఐ తెలిపారు.