జగిత్యాల పట్టణంలోని ఓ భోజనశాలలో మధ్యాహ్నం భోజనం చేసేందుకు వెళ్లిన ఒక కస్టమర్‌కు అన్నంలో స్ప్రింగ్ వెలుగు చూసింది. బాధితుడి ప్రకారం.. వెంటనే హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కష్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం కామన్ అంటూ హోటల్ యజమాని చెప్పడంతో కస్టమర్ మండిపడ్డారు. అంతేకాకుండా ఏం చేస్తావో చేసుకో అంటూ దురుసుగా వ్యవహరించాడని బాధితుడు వాపోయాడు.