శ్రీ మహాదేవుని ఉత్సవాల్లో ఎమ్మెల్యే
NEWS Nov 13,2024 10:34 am
మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ మహాదేవుని ధ్వజ స్తంభ ప్రతిష్టపన మహోత్సవ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. అర్చకుల ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధ్వజ స్తంభం దాతలు గెల్లె మల్లేష్ దంపతులని సత్కరించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కదుర్క నర్సయ్య, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి , గ్రామస్తులు పాల్గొన్నారు