హుందాగా రాజకీయాలు చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్ పల్లిలో ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రలో ఏర్పాటు చేసిన తన ఫ్లెక్సీలను ప్రత్యర్థులు వెంటనే తొలగించారని ఆయన తెలిపారు. మరికొందరు తనపై ఆరోపణలు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సరైనది కాదన్నారు. రైతుల కోసం మీరు పాదయాత్రలు చేయండి, సమస్యలు తెలుసుకోండి కానీ ఇలా అనవసర రాద్దాంతం చేయడం సరైనది కాదని, హుందాగా రాజకీయాలు చేయాలని సూచించారు.