మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పట్టణానికి చెందిన కూన గోవర్ధన్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.