దుబాయ్‌లో జగిత్యాల జిల్లా మహిళ మృతి
NEWS Nov 13,2024 04:36 am
జగిత్యాల: కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామానికి చెందిన ఎన్నమనేని సుప్రియ (35) దుబాయ్‌లో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. రాయికల్ మండలం కుమ్మరపల్లి గ్రామానికి చెందిన సుప్రియకు కథలాపూర్ మండలం అంబర్‌పేట గ్రామానికి చెందిన శ్రీనివాసరావుతో 14 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. దంపతులు ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నారు. సుప్రియ సోమవారం రాత్రి మృతి చెందినట్లు చెప్పారు.