స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని డిమాండ్
NEWS Nov 12,2024 05:23 pm
తెలంగాణలోని గురుకుల స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని UTF డిమాండ్ చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు అనుగుణంగా, విద్యాహక్కు చట్టం ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 వరకే ఉండేలా చూడాలని సీఎస్ శాంతికుమారికి విజ్ఞప్తి చేసింది. గతంలో ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. కాగా రాత్రి వరకు స్కూళ్లు ఉండటంతో తాము ఇళ్లకు వెళ్లేందుకు ఆలస్యం అవుతోందని టీచర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.